ETV Bharat / city

CI CUSTODY: ముగిసిన నాగేశ్వరరావు కస్టడీ.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

author img

By

Published : Jul 22, 2022, 7:34 PM IST

CI CUSTODY: మహిళపై అత్యాచారం, కిడ్నాప్‌, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్టయిన మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వర్‌రావు పోలీస్​ కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు సరూర్​నగర్​ పీఎస్​లో నాగేశ్వరరావును ప్రశ్నించిన పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే వనస్థలిపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ప్రాంతం నుంచి ఇబ్రహీంపట్నంలో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం వరకు పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

CI CUSTODY
CI CUSTODY

CI CUSTODY: వివాహితపై తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మారేడుపల్లి మాజీ ఇన్​స్పెక్టర్​ నాగేశ్వరరావు పోలీసు కస్టడీ ముగిసింది. 5 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు.. నాగేశ్వరరావును హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. మహిళపై అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నాగేశ్వరరావును ప్రశ్నించారు. వనస్థలిపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ప్రాంతం నుంచి ఇబ్రహీంపట్నంలో కారు ప్రమాదానికి గురైన ప్రాంతం వరకు పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

ఈ నెల 7న తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. 10న నిందితుడిని అదుపులోకి తీసుకుని 11న చర్లపల్లి జైలుకు తరలించారు. అత్యాచార ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాలని వనస్థలిపురం పోలీసులు హయత్‌నగర్‌ కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం అంగీకరించింది. ఈ క్రమంలో ఈ నెల 18న నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకొని సరూర్‌నగర్‌ పీఎస్‌లో ప్రశ్నించారు. మహిళతో నాగేశ్వరరావుకు ఉన్న పరిచయాలు, ఇతర విషయాల గురించి పోలీసులు వివరాలు సేకరించారు. ఇప్పటికే మహిళ, ఆమె భర్త, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. దానికి సంబంధించిన ప్రశ్నలను నాగేశ్వరరావు వద్ద సంధించారు. నాగేశ్వరరావు కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వగా.. మరికొన్నింటికి మౌనంగా ఉండిపోయారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వనస్థలిపురం పోలీసులు తెలిపారు. ఈ కేసులో కస్టడీ కన్ఫెషన్‌ రిపోర్టు కీలకం కానుంది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.