ETV Bharat / city

కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

author img

By

Published : Aug 18, 2020, 9:57 PM IST

నీటి విడుదలకు సంబంధించి తమ ఉత్తర్వులను గౌరవించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఏపీ జలవనరుల శాఖ ఈఎన్​సీకీ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ ద్వారా ఉత్తర్వులకు విరుద్ధంగా.. 9 టీఎంసీల పైనే నీటిని వాడుకున్నారని.. ఇంకా వాడుతున్నారని పేర్కొంది. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించింది.

'కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకున్నారు'.. కృష్ణా బోర్డు లేఖ
'కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకున్నారు'.. కృష్ణా బోర్డు లేఖ

నీటి విడుదల ఉత్తర్వులను గౌరవించాలని.. పొరుగు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్​కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్​సీకి బోర్డు సభ్యకార్యదర్శి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీల నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేసింది.

అయితే.. ఈ నెల 17వ తేదీ వరకు 9.517 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారని.. ఇంకా నీటి విడుదల కొనసాగుతోందని బోర్డు లేఖలో లెక్కలతో సహా వివరించింది. ఇకనైనా నీటి విడుదలకు సంబంధించి తాము జారీ చేసిన ఉత్తర్వులను పూర్తి స్థాయిలో పాటించాలని బోర్డు సూచించింది.

ఇవీ చూడండి:

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.