ETV Bharat / city

ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదు... ఏపీకి కృష్ణా నదీ బోర్డు లేఖ

author img

By

Published : Aug 28, 2020, 4:16 AM IST

పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ జలాలు వాడుకుంటున్నారని కృష్ణా నదీ బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కృష్ణాబోర్డు స్పందించింది. తాము ఏ రాష్ట్రం పట్టా పక్షపాతం చూపమని స్పష్టం చేసింది. గతంలో రెండుమార్లు తెలంగాణకు కూడా లేఖలు రాశామని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ఈఎస్సీకి కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి మౌంతాంగ్ లేఖ రాశారు.

ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదు... ఏపీకి కృష్ణా నదీ బోర్డు లేఖ
ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదు... ఏపీకి కృష్ణా నదీ బోర్డు లేఖ

ఏ రాష్ట్రం పట్లా పక్షపాతంతో వ్యవహరించడం లేదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఉత్తర్వులకు మించి ఎక్కువ జలాలు వాడుకున్నారంటూ బోర్డు రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో స్పందించని బోర్డు ఏపీ విషయంలో మాత్రం వెంటనే స్పందిస్తోందని... తాము కేటాయింపులకు లోబడే పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేశామని పేర్కొన్నారు.

తెలంగాణకు రెండు సార్లు లేఖలు

ఏపీ ఈఎన్సీ లేఖపై స్పందించిన కృష్ణా నదీయాజమాన్య బోర్డు... తమ పరిధికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామని ఏ రాష్ట్రం పట్ల కూడా పక్షపాతం చూపడం లేదని స్పష్టంచేసింది. నీటివిడుదల ఉత్తర్వులను ఔట్​లెట్ల వారీగా ఇచ్చామని, అందుకు అనుగుణంగానే ముందుజాగ్రత్తగా పోతిరెడ్డిపాడు విషయమై లేఖ రాసినట్లు బోర్డు తెలిపింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు నీరు విడుదల చేయవద్దని గతంలో రెండు మార్లు తెలంగాణకు కూడా లేఖలు రాశామని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు బోర్డు పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీకి బోర్డు సభ్యకార్యదర్శి మౌంతాంగ్ లేఖ రాశారు.

ఇదీ చదవండి : ఆ పేకాట వ్యవహారంతో నాకు సంబంధం లేదు : మంత్రి జయరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.