ETV Bharat / city

ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని

author img

By

Published : Oct 24, 2020, 4:00 PM IST

మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నడుచుకోవాలని కొడాలి నాని పేర్కొన్నారు.

Kodali Nani Serious comments on Local body Elections
కొడాలి నాని

కొడాలి నాని

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని... అలా కాకుండా ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తామంటే అది జరిగే పనికాదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​కుమార్‌ తాను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఉద్ఘాటించారు.

కృష్ణా జిల్లా గుడ్డవల్లేరులో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. బిహార్‌ శాసనసభకు ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన పరిస్థితి ఉందని, వాటితో స్థానిక సంస్థల ఎన్నికలు పోల్చకూడదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండీ... కట్టడం చేతగాని వాళ్లకు... కూల్చే హక్కులేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.