ETV Bharat / city

POWER CHARGES: విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలి: కళా వెంకట్రావు

author img

By

Published : Sep 14, 2021, 5:28 PM IST

kala venkatrao
kala venkatrao

విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు డిమాండ్​ చేశారు. విద్యుత్​ ఛార్జీలు పెరగటానికి ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు.

ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు డిమాండ్​ చేశారు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై విడతల వారీగా విద్యుత్ భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బిల్లులు కట్టలేక ప్రజలు గుడ్డిదీపాలు వాడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. విద్యుత్​ ఛార్జీలు పెరగటానికి ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలే కారణమని ధ్వజమెత్తారు.

'ప్రతీ మూడు నెలలకోసారి ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్​మెంట్ పేరుతో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గినా ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో దోపిడీ చేయటం దుర్మార్గం. సౌర, పవన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయవద్దని తెదేపా మొత్తుకున్నా మొండిగా సీఎం జగన్ వ్యవహరించటం వల్లే ప్రజలపై రూ.2542.70కోట్ల అదనపు భారం పడింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చిన రూ. 24,491 కోట్లు అవినీతికి, దుబారాకు జగనార్పణం చేశారు' - కళా వెంకట్రావు

ఇదీ చదవండి:

Inter Exams: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.