ETV Bharat / city

తెలంగాణ హైకోర్టు సీజేగా.. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

author img

By

Published : Jun 19, 2022, 8:40 PM IST

తెలంగాణ రాష్ట్ర హెకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

cji
cji

Highcourt CJ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​ను నియామిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​కు కొలీజియం సిఫారసుల మేరకు సీజేగా పదోన్నతి లభించింది. జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ.. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

అసోంలోని గువాహటిలో 1964 ఆగస్టు 2న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ జన్మించారు. అసోం మాజీ ఏజీగా ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ పని చేశారు. గువాహటిలోని డాన్‌బాస్కో పాఠశాలలో జస్టిస్‌ భూయాన్‌ విద్యనభ్యసించారు. గువాహటిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్ఎం పూర్తి చేసిన ఆయన.. అక్కడే హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. 2011న అసోం అదనపు ఏజీగా నియమితులైన ఆయన.. 2011న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామించారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ బదిలీ అయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.