ETV Bharat / city

ఆ వివరాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది?: పవన్ కల్యాణ్

author img

By

Published : Jul 22, 2021, 12:18 PM IST

janasena chief
పవన్ కల్యాణ్

రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని.. రైతులు వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారని జనసేన అధినే పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని.. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని పవన్‌ హెచ్చరించారు.

రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి వివరాలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని.. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని పవన్‌ హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలవుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని నిలదీశారు.

రైతుల నుంచి పంట కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా తిప్పించుకున్న దళారులు గురించి విన్నాం.. చదివామని ఇప్పుడు రైతుల్ని రోడ్డుపైకి తెచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నామని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా.. తొలి నుంచి నేటి వరకూ రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉందన్నారు.

పెట్టుబడులకు డబ్బులు ఎలా వస్తాయి..

రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1800 కోట్లు వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. గతంలో రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుందని.. రబీ డబ్బులు రాక, రుణాలు అందకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించారు. పంట నష్ట పరిహారం సక్రమంగా చెల్లించడం లేదని..ఈ పరిస్థితులోనే కోనసీమలోని కొన్ని గ్రామాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని అన్నారు.

జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీగా విడదీయడం దురదృష్టకరమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అధికార పార్టీ మద్దతు దారుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. ఆరోపించారు. పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమేనని పవన్‌ అన్నారు. మిర్చి రైతులకు అవసరమైన విత్తనాలు అందకపోవడంతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ysr Kapu Nestam: నేడు వైఎస్సార్​ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల

'బర్డ్​ ఫ్లూ'పై ఎయిమ్స్​ డైరెక్టర్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.