ETV Bharat / city

IYR KRISHNARAO: 'తితిదే బోర్డు నియామకాల్లో రాజకీయాలు..!'

author img

By

Published : Sep 17, 2021, 8:46 AM IST

తితిదే బోర్డు నియామకాలు ఎప్పుడూ రాజకీయంగానే జరుగుతుంటాయని ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. ఏం చేసినా అడిగేవారు లేరనే ఉద్దేశంతోనే... నియామకాలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.

iyr-krishna-raos-response-on-the-formation-of-the-new-governing-body-of-ttd
'తితిదే బోర్డు నియామకాల్లో రాజకీయాలు..!'

తితిదే నూతన పాలకమండలి ఏర్పాటుపై ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు. సీఎం ఎవరైనా... తితిదే బోర్డు నియామకాలు రాజకీయంగానే జరుగుతుంటాయని తెలిపారు. ఏంచేసినా అడిగేవారు లేరన్నట్లుగా.. జగన్‌ ప్రభుత్వంలో నియామకాలు చేపడుతున్నారని ఐవైఆర్‌ మండిపడ్డారు. హైందవ ధర్మసంస్థల్లో ఇష్టమొచ్చినట్లు నియామకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా మేల్కొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు.

ఇదీ చూడండి: subcommittees Meeting: నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.