ETV Bharat / city

Huzurabad bypoll result: ఈటలదే జోరు.. ఏఏ రౌండ్​లో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయంటే?

author img

By

Published : Nov 2, 2021, 9:06 AM IST

Updated : Nov 2, 2021, 5:26 PM IST

1
1

హుజూరాబాద్​లో కౌంటింగ్ ఉత్కంఠంగా​ కొనసాగుతోంది. 16 వేల ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ ముందంజలో ఉన్నారు. 8వ రౌండ్​లో తెరాసకు స్వల్ప అధిక్యం దక్కినా... ఈటలనే ముందున్నారు.

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో 8, 11 రౌండ్లు మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్​నగర్​లో ఈటల ముందంజలో నిలిచారు.

హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాల్లో ఈటల రాజేందర్‌ ఆధిక్యం కొనసాగుతోంది. 18వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం లభించింది. 18 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా 16,494 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది.

17వ రౌండ్‌లోనూ భాజపాకు ఆధిక్యం లభించింది.. 17వ రౌండ్‌లో భాజపా 5,610, తెరాసకు 4,187 ఓట్లు రాగా.. ఈటల 1,423 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. 17 రౌండ్ల తర్వాత భాజపా 79,785, తెరాసకు 65,167 ఓట్లు లభించగా... ఈటల 14,618 ఓట్లతో దూసుకుపోతున్నారు.

16వ రౌండ్‌లో భాజపాకు 1,772 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 16వ రౌండ్‌లో భాజపాకు 5,689, తెరాసకు 3,917 ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్‌లో భాజపాకు 2,149 ఓట్ల ఆధిక్యం లభించింది. 15 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 11,583 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. 14వ రౌండ్‌లో భాజపా 4,836, తెరాసకు 2,971 ఓట్లు రాగా.. ఈటలకు 1,046 ఓట్ల మెజారిటీ వచ్చింది. 14 రౌండ్లు ముగిసేసరికి భాజపా 58,333, తెరాసకు 49,945 ఓట్లు రాగా.. భాజపా 9,434 ఓట్ల ఆధిక్యంతో జోరు కనబరుస్తోంది.

13వ రౌండ్‌లోనూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 13వ రౌండ్‌లో భాజపాకు 4,836, తెరాసకు 2,971 ఓట్లు రాగా.. ఈటలకు 1,865 ఓట్ల ఆధిక్యం లభించింది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా 8,388 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది.

12వ రౌండ్‌లో మళ్లీ భాజపాకు ఆధిక్యం లభించింది. 12వ రౌండ్‌లో భాజపాకు 4,849, తెరాసకు 3,632 ఓట్లు రాగా.. ఈటలకు 1,217 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 53,497, తెరాసకు 46,974 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా 6,523 ఓట్ల ఆధిక్యంతో జోరు కనబరుస్తోంది.

11వ రౌండ్‌లో తెరాసకు 385 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్‌లో భాజపాకు 3,941, తెరాసకు 4,326 ఓట్లు వచ్చాయి. 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాసకు ఆధిక్యం లభించింది. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 5,306 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

10వ రౌండ్‌లోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ ముందజలో నిలిచారు. 10వ రౌండ్​లో 526 ఓట్ల ఆధిక్యం సాధించారు. పది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 5,691 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పదో రౌండ్‌లో భాజపాకు 4,295, తెరాసకు 3,709 ఓట్ల దక్కగా.. కాంగ్రెస్ 118 ఓట్లతో సరిపెట్టుకుంది. 10 రౌండ్లు ముగిసేసరికి మొత్తంగా భాజపాకు 44,707, తెరాసకు 39,016 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,487 ఓట్లు పడ్డాయి.

8వ రౌండ్ మినహా మిగిలిన రౌండ్లలో ఈటలకే ఆధిక్యం తొలి ఏడు రౌండ్లలోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో నిలిచారు. రౌండ్​ రౌండ్​కు కమలం పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. 9వ రౌండ్​లో ఈటల రాజేందర్​ 1,835 ఓట్ల ఆధిక్యం సాధించారు. 9వ రౌండ్​లో 5,105 ఓట్లతో ముందంజలో నిలిచారు. 9వ రౌండ్​లో భాజపా - 5,305, తెరాస - 3,470, కాంగ్రెస్​ - 174 ఓట్లు సాధించాయి. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి భాజపా - 40,412, తెరాసకు - 35,307 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్​ మినహా మిగిలిన అన్ని రౌండ్లలో ఈటలే ఆధిక్యంలో ఉన్నారు.

ఎనిమిదో రౌండ్​లో తెరాసకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. 8వ రౌండ్​ 162 ఓట్ల ఆధిక్యంతో గులాబీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 3,270 ఓట్ల అధిక్యంతో ఉన్నారు. 8వ రౌండ్​లో భాజపా - 4,086, తెరాస - 4,248, కాంగ్రెస్ - 89 ఓట్లు సాధించాయి. 8 రౌండ్లు ముగిసేసరికి 1,175 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు చేసిన గ్రామం శాలపల్లిలోనూ కమలం పార్టీనే ముందంజలో నిలిచింది. ఈ గ్రామంలో భాజపాకు 312 ఓట్లు రాగా.. తెరాసకు 175 ఓట్లు వచ్చాయి.

కరీంనగర్‌లోని ఎస్​ఆర్​ఆర్ డిగ్రీ కళాశాలలో పటిష్ఠ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ జరుగుతోంది. తొలుత 753 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓట్లు లెక్కించనున్నారు. తొలుత హుజూరాబాద్‌ మండలంలోని గ్రామాల ఓట్ల లెక్కించారు. అనంతరం వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రం వరకు హుజూరాబాద్ తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

Last Updated :Nov 2, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.