ETV Bharat / city

ACCMC: ' ఇప్పుడు వ్యతిరేకించినా.. తర్వాత అర్థం చేసుకుంటారు'

author img

By

Published : Jan 7, 2022, 2:11 PM IST

అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పుడు రైతులు వ్యతిరేకించినా.. తర్వాత అర్థం చేసుకొని సహకరిస్తారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోం మంత్రి పలికారు.

home minster sucharitha comments on ACCMC
home minster sucharitha comments on ACCMC

అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు అంశంపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. అమరావతి రాజధానికి భూములు ఇవ్వమన్నప్పుడు రైతులు మొదట వ్యతిరేకించారని.. ఆ తరువాత అర్థం చేసుకొని భూములిచ్చారన్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత

ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్నారన్నారు. మేలు చేస్తామని చెప్పినప్పుడు మొదట వ్యతిరేకించినా.. ఆ తర్వాత అర్థం చేసుకొని సహకరిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా రైతులకు ఏంకావాలో చెప్పాలని అడుగుతోందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోంమత్రి సుచరిత సూచించారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సుచరిత ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి:

Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.