ETV Bharat / city

బాలుడిని చితకబాదిన బంధువు... వీడియో వైరల్

author img

By

Published : Aug 12, 2020, 10:50 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ)లో అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఓ బాలుడిని అతని పెదనాన్న విచక్షణారహితంగా చితకబాదాడు. కాళ్లను తాడుతో కట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఈ సంఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

his-uncle-indiscriminately-crushed-a-boy-who-allegedly-doing-obscene-messages
బాలుడిని చితకబాదిన బంధువు... వీడియో వైరల్

బాలుడిని చితకబాదిన బంధువు... వీడియో వైరల్

అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని ఓ బాలుడిని అతని పెదనాన్న విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మల్కాపూర్​లో జరిగింది. గ్రామానికి చెందిన బాలయ్య కూతురి తోటి కోడలి కుమార్తెకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్నాడని తన తమ్ముడి కుమారుడు భీమయ్యను(14) బాలయ్య చితకబాదాడు. కాళ్లను తాడుతో కట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.

ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ)లో చోటుచేసుకుంది. అనంతరం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా... మళ్లీ ఇలాంటి తప్పు చేయనని బాధిత బాలుడు క్షమాపణ చెప్పడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. చితకబాదుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి:

రోడ్డంతా డీజిల్... కనకదుర్గ వారధిపై ఆయిల్ ట్యాంక్ లీక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.