ETV Bharat / city

రాజధాని కమిటీపై తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా

author img

By

Published : Nov 15, 2019, 9:40 AM IST

రాజధాని అమరావతిలో నిర్మాణాలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్డీఏ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28 కు వాయిదా వేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటును సవాల్​ చేస్తూ.. గుంటూరు జిల్లా తూళ్లూరు రైతులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు.

రాజధాని కమిటీపై తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా

అమరావతితో పాటు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై సిఫార్సులు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి జీ.ఎన్.రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, ఛైర్మన్, పురపాలక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కమిటీ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

కమిటీకి అధికారం లేదు

సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రణాళికలను పునఃపరిశీలన చేసే అధికారం అథార్టీకి ఉంటుంది తప్ప నిపుణుల కమిటీకి లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. రాజధాని నిర్మిస్తామని, రైతులకు ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్లే అన్నదాతలు భూములిచ్చారని కోర్టుకు తెలిపారు. ఆ హామీకి సర్కారు కట్టుబడి ఉండాలని అన్నారు. అన్ని అంశాలు పరిశీలించాకే అమరావతిని నూతన రాజధానిగా నిర్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో పనుల్ని అకస్మికంగా నిలిపివేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆందోళనతోనే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్​రెడ్డి కోర్టుకు తెలిపారు.

మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థన తిరస్కరణ

రాజధాని ప్రణాళికలను పునఃపరిశీలన చేయకుండా కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న అభ్యర్థనను న్యాయమూర్తి సున్నితంగా తిరస్కరించారు. దీనిపై స్పందించాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేశారు.

ఇదీ చూడండి:

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా ?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.