ETV Bharat / city

వాతావరణం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

author img

By

Published : Oct 10, 2020, 10:06 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని... రాగల 24గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది.

heavy rains to be fell in the state in upcoming 24hours
వాతావరణం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఈ నెల 12వ తేదీ ఉదయానికి...విశాఖకు ఎగువన తీరాన్ని దాటే అవకాశమున్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు

గుంటూరుబొల్లాపల్లె 8.1 సె.మీ
గుంటూరురొంపిచర్ల4.5 సె.మీ
తూర్పుగోదావరిఏలేశ్వరం5.4 సె.మీ
శ్రీకాకుళంరాజాం 5 .0సె.మీ
అనంతపురంపామిడి6.2 సె.మీ

విశాఖ

విశాఖ

నక్కపల్లి

అనకాపల్లి

3.0 సె.మీ

0సె.మీ

ప్రకాశంసంతమాగులూరు3.0 సె.మీ
విజయనగరంపాలకొండ 2.5 సె.మీ
కర్నూలు ఆదోని2.0 సె.మీ
చిత్తూరురామకుప్పం1.5 సె.మీ

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు

విజయవాడ 37 డిగ్రీలు
విశాఖపట్నం 36 డిగ్రీలు
తిరుపతి 39 డిగ్రీలు
అమరావతి 40 డిగ్రీలు
విజయనగరం 36 డిగ్రీలు
నెల్లూరు 38 డిగ్రీలు
గుంటూరు 38 డిగ్రీలు
శ్రీకాకుళం 34 డిగ్రీలు
కర్నూలు 39 డిగ్రీలు
ఒంగోలు 37 డిగ్రీలు
ఏలూరు 39 డిగ్రీలు
కడప 38 డిగ్రీలు
రాజమహేంద్రవరం38 డిగ్రీలు
కాకినాడ 34 డిగ్రీలు
అనంతపురం36 డిగ్రీలు

ఇదీ చదవండి:

గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని కొందరు.. వద్దని ఇంకొందరు.. ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.