ETV Bharat / city

Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం.. చెరువుల్లా మారిన రహదారులు

author img

By

Published : Oct 16, 2021, 3:00 PM IST

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Hyderabad Rains
Hyderabad Rains

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ కారణంగా నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్‌బీనగర్‌, చింతలకుంట, దిల్​సుఖ్​నగర్​ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్‌, లంగర్‌ హౌస్‌, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.

ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్‌పేట, లక్డీకాపూల్‌, మెహిదీపట్నం, చాదర్‌ఘాట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకల అంతరాయం ఏర్పడుతుండటంతో... వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు, వీధుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్‌పేట్, బీఎన్‌ రెడ్డి నగర్‌, తుర్కయంజాల్, మీర్‌పేట్, పీర్జాదీగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.

అప్రమత్తమైన జీహెచ్​ఎంసీ..

రేపు, ఎల్లుండి కూడా జంట నగరాల్లో పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న దృష్ట్యా.. జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని మోహరించింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని.. ఆయా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

ప్రభుత్వ శాఖల ఎఫ్​డీల మాయంపై కొనసాగుతున్న దర్యాప్తు.. వారి హస్తముందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.