హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

author img

By

Published : Sep 19, 2020, 7:12 PM IST

heavy-rain-in-hyderabad-city

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. బేగంబజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్​నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, ఎస్‌ఆర్​ నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, కూకట్​పల్లి, ఎల్బీనగర్​, హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరి, నేరెడ్​మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలో మరో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు, ఎల్లుండి అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.