ETV Bharat / city

శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను విచారించిన హైకోర్టు

author img

By

Published : Mar 26, 2022, 4:50 AM IST

Updated : Mar 26, 2022, 5:29 AM IST

Sivasankar Reddy Bail Petition
Sivasankar Reddy Bail Petition

YS Viveka murder case: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారం లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

YS Viveka murder case: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారం లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది ఏ. చెన్నకేశవులు కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 28 కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీ.హెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలిచ్చారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది . సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. శివశంకరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈ ఏడాది జనవరి 17 న హైకోర్టు కొట్టివేసింది . తాజాగా మరోసారి ఆయన బెయిల్ కోసం పిటిషన్ వేశారు.

ఇదీ చదవండి: వివేకా హత్యకేసులో... మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ

Last Updated :Mar 26, 2022, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.