ETV Bharat / city

చిప్ టెక్నాలజీపై కొత్త కోర్సు.. బీటెక్​లో ప్రవేశపెట్టిన ఐఐటీ హైదరాబాద్

author img

By

Published : Sep 17, 2022, 8:29 PM IST

IIT Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్​ బీటెక్​ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్​లో నూతనంగా ఐసీ డిజైన్​ అండ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేలా యూట్యూబ్​ వీడియోను రూపొందించినట్టు తెలిపింది.

Etv Bharat
Etv Bharat

IIT Hyderabad: కొత్త టెక్నాలజీలు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేసే యోచనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్ బీటెక్​లో కొత్త ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్​లో ఐసీ డిజైన్​ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐటీ హైదరాబాద్ పీఆర్వో మిథాలీ తెలియజేశారు.

ఈ కోర్సు గురించి మరింత సమాచారం కోసం యూట్యూబ్​ వీడియోను కూడా రూపొందించారు. ఈ వీడియోలో కోర్సుకు సంబంధించిన పూర్తి సమాచారం, భవిష్యత్ అవకాశాలు, ఫీజు వివరాలు ఉంటాయని మిథాలీ తెలిపారు. https://youtu.be/sF-9X9OShcM యూట్యూబ్ లింక్​లో ఈ వీడియో చూడవచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన ఏమైనా అనుమానాలుంటే తమను నేరుగా కూడా సంప్రదించవచ్చని మిథాలీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.