ETV Bharat / city

GOVERNOR: ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్​కు గవర్నర్ అభినందన

author img

By

Published : Aug 5, 2021, 7:49 PM IST

ఒలింపిక్స్​లో రజత పతక విజేత రవికుమార్‌ దహియాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందించారు. మరోవైపు.. కాంస్యం సాధించిన హాకీ జట్టును సీఎం జగన్ ప్రశంసించారు. ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఒలంపిక్ రజత పతక విజేత రవికుమార్​ను అభినందించిన గవర్నర్
ఒలంపిక్ రజత పతక విజేత రవికుమార్​ను అభినందించిన గవర్నర్

ఒలింపిక్స్ రెజ్లింగ్ లో రజత పతక విజేత రవికుమార్‌ దహియాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఫైనల్లో ప్రత్యర్థిపై రవికుమార్ అత్యుత్తమ పోరాటం చేశారని కొనియాడారు. అతను రజతం సాధించడం పట్ల దేశం గర్వపడుతోందన్న గవర్నర్... భవిష్యత్తులో రవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

రవికుమార్​కు చంద్రబాబు అభినందన..

భారతదేశానికి ఒలింపిక్స్ రజత పతకం సాధించిన రవికుమార్ దహియాకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశానికి ఇది అద్భుతమైన రోజు అని ప్రశంసించారు.

హాకీ జట్టుకు సీఎం అభినందనలు...

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు బృందానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. బలమైన జర్మనీని ఓడించి భారత జట్టు పతకాన్ని కైవసం చేసుకోవడంపై సీఎం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంతో, జట్టు 41 సంవత్సరాల విరామం తర్వాత జాతీయ క్రీడను ఒలింపిక్ పతక పట్టికలో తిరిగి నిలబెట్టిందని, ఇది గర్వించదగిన అంశమని అన్నారు.

ఇదీ చదవండి:

Ravi Kumar Dahiya: రైతుబిడ్డ.. 'పట్టు' పట్టి రజతం తెచ్చాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.