ETV Bharat / city

విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్​ విందు.. పాల్గొన్న సీఎం జగన్​

author img

By

Published : Apr 27, 2022, 9:49 PM IST

Updated : Apr 28, 2022, 4:58 AM IST

ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్​ విందు
ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్​ విందు

రంజాన్​ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్​ విందు ఇచ్చింది. ఎన్టీఆర్​ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్​ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్​తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఖాదర్‌బాషా, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ గౌస్‌లాజం, ఎమ్మెల్యేలు అఫీజ్‌ఖాన్‌, ముస్తాఫా తదితరులు ఈ సందర్భంగా సీఎంను సన్మానించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ సీఎం జగన్‌ ముస్లింలు రాజకీయ సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పదవిని ముస్లింలకు ఇచ్చారని, ఎమ్మెల్సీ పదవుల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వనిత, జోగి రమేశ్‌, రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.

ముసాఫీర్‌ ఖానాను ప్రారంభించిన సీఎం జగన్‌

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విజయవాడ పంజాసెంటర్‌లో గత ప్రభుత్వ హయాంలో రూ.13.88 కోట్లతో నిర్మించిన షాజహూర్‌ ముసాఫీర్‌ ఖానాను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ప్రారంభం అనంతరం రెండో అంతస్తులోని కల్యాణ మండపాన్ని సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

...

అవస్థలు పడిన ప్రజలు

సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల చేపట్టిన చర్యలతో విజయవాడ పాతబస్తీలోని వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందిపడ్డారు. ప్రధాన రహదారి పొడవునా పోలీసులు దుకాణాలు మూసివేయించారు. దీంతో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రోడ్డుకు రెండు వైపులా దుకాణదారులూ బయటకు రావడానికి వీల్లేకుండా బారికేడ్లు, వస్త్రాలు కట్టారు. సీఎం పర్యటన సంగతి తెలియక వివిధ ప్రాంతాల నుంచి పాతబస్తీకి వచ్చిన కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఎటు వెళ్లినా దారివ్వకపోవడంతో ఒక దశలో అసహనానికి గురయ్యారు. చివరికి ఎటు వెళ్లాలో తెలియక కొన్ని కూడళ్లలో రోడ్డు పక్కన నిల్చుండిపోయారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు.

ఇదీ చదవండి: కుప్పంలో గ్రానైట్​ అక్రమ మైనింగ్​పై ఎన్​జీటీ కీలక ఆదేశాలు..

Last Updated :Apr 28, 2022, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.