SMART METERS : వ్యవసాయేతర విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్ల బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. తదుపరి మీటర్ల బిగింపునకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల్లో గృహ, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ పరిధిలో కనెక్షన్ల వారీగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు.
200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే ఇళ్లకే స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు. మొత్తంగా 18.73 లక్షల గృహ విద్యుత్ వినియోగ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. అలాగే 15.48 లక్షల వాణిజ్య కనెక్షన్లు, 1.19 లక్షల పరిశ్రమలు, 3.21 లక్షల ప్రభుత్వ కార్యాలయాలకూ మీటర్లు పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా గృహ, వాణిజ్య, పరిశ్రమల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ కార్యాలయాలకూ స్మార్ట్ మీటర్లను రాష్ట్రప్రభుత్వం బిగించనుంది.
వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల అంశంపై ఏపీఈఆర్సీకి ఈ ఏడాది మేలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 2022 డిసెంబరు నుంచి వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
గవర్నర్‌ను కలిసిన జగన్ దంపతులు : గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సతీమణి భారతి తో కలసి రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్ దంపతులను కలిశారు. అనంతరం 45 నిముషాలు పాటు గవర్నర్ తో సీఎం సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్లు తెలిసింది. పాలనా పరమైన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: