ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి వేడుకలు

author img

By

Published : Sep 2, 2019, 2:46 PM IST

GANESH

వినాయకచవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పోటీపడి మరీ భారీ విగ్రహాలు ఏర్పాటుచేశారు. వాడవాడల్లో కొలువుదీరిన గణపయ్య భక్తుల పూజలందుకుంటున్నాడు. పిల్లలూ పెద్దలూ ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి వేడుకలు

వినాయకచవితి శోభతో రాష్ట్రంలో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లోని వీధులన్నీ పండగవాతావరణంతో కోలాహలంగా మారాయి. విగ్రహాలు, పూజసామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

తిరుపతిలోని తన నివాసం వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి వినాయకపూజలో పాల్గొన్నారు. అనంతరం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారికి..... ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి అందజేశారు. స్వామివారిని దర్శించుకునేందకు భక్తులు పోటెత్తారు. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 2 లక్షల మట్టిగాజులతో రూపొందించిన 30 అడుగుల వినాయక ప్రతిమను ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆవిష్కరించి..... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లింలు తయారుచేసిన లడ్డూను మొదటి ప్రసాదంగా స్వామివారికి అందజేశారు.

విశాఖ ఆశిల్‌మెట్టలోని సంపత్‌ వినాయగర్‌ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు భక్తులకు మట్టి విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. లక్ష్మీగ్రాఫిక్స్‌ యాజమాన్యం భక్తులకు మట్టి గణపతులు, మొక్కలతో పాటు పర్యావరణహిత సంచులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కంభంలోని ప్రధాన రహదారులు, వీధులన్నీ.... విగ్రహాలు, పూజాసామగ్రి కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. యర్రగొండపాలెంలోని కొలుకుల రోడ్‌, పుల్లలచెరువు సెంటర్‌లో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. చలవ పందిళ్లతో మండపాలను సుందరంగా అలంకరించి గణనాథున్ని ప్రతిష్ఠింపజేశారు.

కర్నూలు పెద్దమార్కెట్‌లో ఏర్పాటుచేసిన 65 అడుగుల భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే అతి పెద్ద విగ్రహమని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కాలనీ వాసులు గణేషుడిని దర్శించుకుని పూజలుచేశారు. నంద్యాల సంజీవనగర్‌ రామాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన శ్రీత్రిముఖ వస్త్ర గణపతి విగ్రహాన్ని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సాయిరాంబాబా ఆవిష్కరించారు. 570 పట్టు చీరలతో రూపొందించిన ఈ వినాయకుడికి ఎంపీతో పాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పత్తికొండ సాయినగర్‌ కాలనీలో.... సాయి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహం స్థానికులకు ఆకట్టుకుంటోంది.

శ్రీశైల పుణ్యక్షేత్రంలో... గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాక్షిగణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మృత్తికాగణపతికి విశేషపూజాధికాలు జరిపించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతి, యాగశాలలోని కాంస్యగణపతికి పూజలు నిర్వహించారు. 9 రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల్లో... ప్రతి రోజు... ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు..

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ దశభుజ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగపూజ, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక భక్తులతో, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని వినాయకుడి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. కర్నూలు పెద్ద మార్కెట్‌ వద్ద 65 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే అతి పెద్ద విగ్రహమని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరం దివాన్‌చెరువులో..... నవాధాన్యాలతో తయారుచేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్వామివారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు సమీప ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు..

శ్రీకాకుళం విజయగణపతి ఆలయంలో భక్తులు వినాయక దీక్షలు తీసుకున్నారు. స్వామివారికి పుష్పాలు, గరికలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో వాడవాడల్లో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యను భక్తులు దర్శించుకుంటున్నారు.

Intro:ap_knl_31_02_vinayaka_vedukalu_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి సంధర్భంగా తేరు బజారులో 11,500 యాపిల్ పండ్లు తో 31 అడుగులు వినాయక విగ్రహం తయారు చేశారు. కొండవీటి ప్రాంతంలో 200 కిలోల బాదం పప్పు తో 16 అడుగులు తయారు చేసిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణానికి హాని చేయని మట్టి, ప్రత్యేక విగ్రహాలు తయారు చేసి పూజిస్తున్నట్లు వినాయక మండలి సభ్యులు తెలిపారు. బైట్స్:1,మాచాని శివ,2,రాముడు, సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:ప్రత్యేక


Conclusion:వినాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.