ETV Bharat / city

నిరసనలతో భగ్గుమన్న రాజధాని ప్రాంతం

author img

By

Published : Dec 23, 2019, 6:14 AM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఐదోరోజూ ఉద్ధృతంగా సాగాయి. వాంటావార్పు, రిలే నిరాహార దీక్షలతో నిరసనలు చేస్తున్న రైతులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను విరమించుకునే వరకూ... వెనక్కి తగ్గబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.

farmers protest in amaravathi for capital city
నిరసనలతో భగ్గుమన్న రాజధాని ప్రాంతం

నిరసనలతో భగ్గుమన్న రాజధాని ప్రాంతం

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సచివాలయంతో పాటు ప్రధాన రహదారులను దిగ్బంధించి ధర్నా చేస్తున్నారు. జీఎన్​ రావు కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత వరుసగా రెండ్రోజులు సెలవులు రావడంతో... పాలనపై ఎలాంటి ప్రభావమూ పడలేదు. నేటి నుంచి సచివాలయ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కానుండటంతో... మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేయాలని రైతులు నిశ్చయించుకున్నారు.

అన్నదాతలకు వివిధ సంఘాలు, న్యాయవాదులు మద్దతు తెలపడంతో... ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోననే ఉత్కంఠ నెలకొంది. సచివాలయానికి వెళ్లే మార్గంతో పాటు ప్రధాన కూడళ్లలో సుమారు 600 మంది పోలీసులు మోహరించారు. సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులకు నిరసన సెగ తగలకుండా... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తుండగా... ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని రైతులు గట్టిగా చెబుతున్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ చీకటి కాకూడదనేదే తమ ఆలోచనని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. తమ ఆకాంక్షను బలంగా వినిపించేందుకు సిద్ధమైన అన్నదాతలు... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఇవాళ కలిసేందుకు సమయం కోరాలని నిశ్చయించుకున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వేసవి విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తమ ఆవేదనను తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండీ...

కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.