ETV Bharat / city

'సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు' అంటూ.. సామాజిక మాధ్యమాల్లో కల్పిత కథనాలు!

author img

By

Published : Jul 14, 2021, 12:26 PM IST

సీఎం జగన్‌ బెయిల్‌ రద్దంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి సీఐడీ అదనపు డీజీకి వైకాపా ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, మరోవైపు ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నారంటూ సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌కు వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు.

fake posts on cm jagan bail
సామాజిక మాధ్యమాల్లో కల్పిత కథనాలు

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిల్‌ ఈ నెల 14న రద్దవుతుంది’ అంటూ కల్పిత కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు మనోహర్‌ తదితరులు సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు.

‘ముఖ్యమంత్రి బెయిల్‌ రద్దయ్యే రోజున తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులను కూడా నమ్మవద్దు. 1988 డిసెంబరు, 1991 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనల దృష్ట్యా నీలి గూండాలను మరోసారి ఎదుర్కొనక తప్పదు, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుంది’ ఒక కల్పిత కథనాన్ని రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, మరోవైపు ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా ఉన్న ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

Penna Cements‌ case: నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదు: సీఎం జగన్

జమ్ముకశ్మీర్​లో డ్రోన్​ కలకలం- బలగాలు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.