ETV Bharat / city

Exports Increased: కొవిడ్ సమయంలో రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు.. అంచనా విలువ ఎంతంటే?

author img

By

Published : Mar 20, 2022, 9:27 AM IST

Exports Increased :కరోనా సమయంలో రాష్ట్రంలో ఎగుమతులు వృద్ధి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ 1.24 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. కొవిడ్ సమయంలో జరిగిన ఆక్వా ఎగుమతులే ఈ వృద్ధికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

exports increased
కొవిడ్ సమయంలో రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు

Exports Increased: కొవిడ్ సమయంలో రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి లక్షా 24 వేల 745 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసినట్టు పరిశ్రమల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మునుపటి ఏడాదితో పోలిస్తే 2 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు పెరిగినట్టు పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. 2019-2020లో దాదాపు 14.8 బిలియన్ డాలర్ల మేర అంటే దాదాపు 1.04 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేసినట్లు పేర్కొంది.

కొవిడ్ సమయంలో రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు

కోల్‌కతా కేంద్రంగా ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక మేరకు ఏపీ నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎగుమతుల విలువ 16.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఏపీ వాటా 5.8 శాతమని డి.జి.సి.ఐ.ఎస్​ వివరించింది. ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తులు కీలకపాత్ర పోషించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్ని మరింతగా మెరుగుపర్చేందుకు ఫిషింగ్ హార్బర్ల నుంచి ప్రాసెసింగ్ సదుపాయాలు పెంచుతున్నట్టు తెలిపింది. మరిన్ని ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం ద్వారా 4.5 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఇదీ చదవండి:

parents fight: పట్టించుకోని పిల్లలపై అమ్మానాన్నల న్యాయపోరాటం


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.