ETV Bharat / city

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు లేని భారం మనకేనా

author img

By

Published : Aug 18, 2022, 2:03 PM IST

Updated : Aug 18, 2022, 2:45 PM IST

CPS రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల  సీపీఎస్‌ రద్దుపై రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హామీలేమీ ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఓపీఎస్‌ను అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్‌ సీపీఎస్‌ రద్దుకు కమిటీ వేయగా హిమచల్‌ప్రదేశ్‌ సైతం పరిశీలిస్తోంది. మన రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దుచేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక, భవిష్యత్తులో ప్రభుత్వం పింఛన్ల భారం మోయలేదంటూ జీపీఎస్‌ను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో ఏమి చేశారు. మన ప్రభుత్వ ప్రయత్నాలపై ఉద్యోగుల స్పందనపై ప్రత్యేక కథనం.

Employees and  on CPS cancellation
సీపీఎస్‌ రద్దు

Cps in AP :జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలని.ప్రతిపక్ష నేతగా జగన్‌ ఉన్నప్పడు అన్న మాటలివి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఏప్రిల్‌ 29వ తేదిన "సీఎంగా సీపీఎస్‌ను రద్దుచేయాలంటే నిమిషం పని. మరి ఎందుకింత ఆలోచిస్తున్నాం? ఓపీఎస్‌ అమలైతే మోయలేని భారం పడుతుంది. పింఛన్ల భారం ఉద్యోగుల జీతాలనూ దాటేసి, మోయలేని స్థాయికి చేరుతుంది. సీపీఎస్‌ ద్వారా వస్తున్న దానికన్నా 70% ఎక్కువగా వచ్చేలా గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) తీసుకురావాలని మన ప్రభుత్వం సంకల్పించిందని" సీఎం జగన్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1.99 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి ప్రొబేషన్‌ ఖరారు చేశారు. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. తర్వాత పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు. చివరికి జీపీఎస్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2,93,653 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పాత పింఛన్‌ అమలుపై గెజిట్‌ విడుదల చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి ఛత్తీస్‌గఢ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ని తీసుకొచ్చారు. ఉద్యోగి బేసిక్‌లో 12% సీజీపీఎఫ్‌లో మదుపుచేయాలి. దీనిపై వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీవిరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తోంది. పింఛన్లు భారం కాకూడదనే.. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పింఛన్ల మొత్తంలో 4% భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పెడుతోంది. సీపీఎస్‌ ఉద్యోగులు, ప్రభుత్వం జమచేసిన మొత్తం నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌)లో రూ.18వేల కోట్లు ఉన్నాయి. ఈ నిధులు వచ్చాక ఉద్యోగుల భాగాన్ని వారి పీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రూ.9 వేల కోట్లను పింఛన్ల కోసం ప్రత్యేకంగా ఉంచుతామంది.

రాజస్థాన్‌లో ఏం చేస్తున్నారంటే...: రాజస్థాన్‌లో 5.32 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచి ఓపీఎస్‌ అమలు చేస్తోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం ఎన్‌ఎస్‌డీఎల్‌లో రూ.39 వేల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం వచ్చాక ఉద్యోగుల వాటాను వారి పీఎఫ్‌ ఖాతాలకు మళ్లిస్తుంది. ఉద్యోగి బేసిక్‌లో పీఎఫ్‌కు 12% జమ చేయాలి. ఈ మొత్తానికి వడ్డీ, రుణాలు ఇస్తుంది. పదవీ విరమణ సమయంలో వెనక్కి ఇచ్చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని సీపీఎస్‌ ఉద్యోగులసంఘం,అధ్యక్షుడు, సీఎం దాస్‌ అన్నారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పు. మేం జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నామని పేర్కోన్నారు. "ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోం. సీపీఎస్‌ ఉద్యోగులకు 35 నెలల డీఏ బకాయిలే ఇవ్వలేదు. సెప్టెంబరు ఒకటిలోపు ఓపీఎస్‌ అమలుచేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం" అని ఆయన అన్నారు.

మోసపూరిత ప్రకటనలను నమ్మబోమాని సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న జీపీఎస్‌లాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మే పరిస్థితి లేదు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జీపీఎస్‌ పేరుతో మభ్యపెడుతున్నారని అన్నారు. ఓపీఎస్‌ ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు.

"సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలుచేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పడదు. ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ సీపీఎస్‌లో ప్రభుత్వవాటా పెరుగుతుంది. ఓపీఎస్‌ అమలుచేస్తే ఉద్యోగులు 6% జీపీఎఫ్‌, పీఎఫ్‌ కింద జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు. ఉద్యోగ విరమణ చేసే వరకు ప్రభుత్వం వాటా చెల్లించాల్సిన అవసరం లేనందున భారంఉండదు" అని సీపీఎస్‌ ఉద్యోగులు అంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 18, 2022, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.