ETV Bharat / city

గాలి పటాలకు విద్యుత్​ పాశం.. తస్మాత్​ జాగ్రత్త!

author img

By

Published : Jan 14, 2021, 7:14 PM IST

గాలిపటం విద్యుత్ వైర్లు, ట్రాన్స్​ఫార్మర్లకు చుట్టుకుంటే దారం ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశముందని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ వైర్లు, ట్రాన్స్​ఫార్మర్ల సమీపంలో ఉండే ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేయవద్దని సూచించారు.

electricity department alert on flying kites
గాలిపటాలకు విద్యుత్​ పాశం

గాలిపటాలకు విద్యుత్​ పాశం

సంక్రాంతి, కనుమ పండగ రోజుల్లో గాలిపటాలు ఎగురవేయడమంటే పిల్లలకు భలే సరదా. గాలిలో చాలా ఎత్తుగా మెలికలు తిరుగుతూ పతంగి ఎగురుగుతుంటే పిల్లలు ఆనందంతో కేరింతలు కొడతారు. ఇలాంటి సంతోషం.. విషాదంగా మారకూడదంటే గాలిపటం ఎగురవేసే సమయంలో పెద్దలు.. వారికి దగ్గరగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేశారు.

విద్యుత్ వైర్లు, ట్రాన్స్​ఫార్మర్ల సమీపంలో ఉండే ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేయవద్దని సూచిస్తున్నారు. ఇవి లేకుండా ఉండే ఖాళీస్థలంలో పతంగులు ఎగురవేయాలని విద్యుత్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గాలిపటం విద్యుత్ వైర్లు, ట్రాన్సుఫార్మర్లకు చుట్టుకుంటే దారం ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశముందని హెచ్చరించారు. పిల్లలు బిల్డింగ్​ పైన గాలిపటం ఎగరవేకుండా పెద్దలు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

సంస్కృతి సంతకం... సంక్రాంతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.