ETV Bharat / city

Dussehra: రాష్ట్రంలో ఘనంగా ముగిసిన దసరా వేడుకలు...

author img

By

Published : Oct 6, 2022, 7:12 AM IST

Dussehra Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శరన్నవరాత్రుల్లో ఉగ్రరూపిణిగా, సరస్వతిగా, ధనలక్ష్మిగా.. రోజుకో అవతారంలో భక్తులకు అభయమిచ్చిన అమ్మవారికి.. దసరా రోజు ఊరేగింపులతో భక్త జనం వీడ్కోలు పలికారు.

Dussehra Celebrations
వైభవంగా దసరా ఉత్సవాలు

Dussehra Celebrations: దసరా వేడుకల చివరి రోజు అమ్మవారిని పలుచోట్ల ఘనంగా ఊరేగించారు. విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద దత్తపీఠంలో వేడుకలు నిర్వహించారు. మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని పూర్ణకళా రాజరాజేశ్వరిగా అలంకరించారు. శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. 101 కొబ్బరికాయలతో విశేషార్చన జరిపారు . పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శమీ వృక్ష పూజలో పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వాహణ: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో.. శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ జిల్లాలో దుర్గాదేవి ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలోని షిర్డీ సాయిబాబా ధాన్య మందిరంలో .. కాశీ హరిద్వార్ నుంచి తెచ్చిన రుద్రాక్షాలతో అభిషేకం నిర్వహించారు. బాబా 104వ మహా సమాధి పుణ్య తిథి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు . పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర నిర్వహించారు.

శోభయాత్రను తిలకించడానికి భారీగా తరలివచ్చిన భక్తజనం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో.. ధనలక్ష్మి అలంకరణలో 25 లక్షల నగదుతో అమ్మవారిని అలంకరించారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, జానపద నృత్యాలతో.. సాంసృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బద్వేలులో గౌణపురం రాజవంశీయులు జమ్మి చెట్టు వద్ద ఆయుధపూజను నిర్వహించారు . అనంతరం పురవీధుల్లో మేళ తాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు . ఆయుధ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు .కర్నూలు జిల్లా వ్యాప్తంగా, భక్తులు జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా దసరా ఉత్సవాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.