ETV Bharat / city

'మా పక్క రూం వారికి కరోనా... మమ్మల్ని కాపాడండి'

author img

By

Published : Apr 30, 2020, 12:01 AM IST

మన దేశంలోని వలస కూలీల వెతలు చూస్తే బాధగా ఉంటుంది. అలాంటిది.. దేశం కాని దేశంలో ఉపాధి లేక... తినడానికి తిండి లేక... వారి దీనస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం స్పందించి తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.

due to corona Telugu people are locked in UAE
due to corona Telugu people are locked in UAE

యూఏఈలోని తెలుగు ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి విదేశాల నుంచి స్వదేశాలకు రాలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక.. తిండి దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను వీడియో రూపంలో చిత్రికరించారు. ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఉన్న గదుల వద్దే.. తాము కూడా నివసించాల్సి వస్తోందని... ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు తెలియడం లేదని అంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మమ్మల్ని కాపాడండి...

ఇదీ చదవండి: విదేశాల్లోని భారతీయుల కోసం కేంద్రం 'మెగాప్లాన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.