మందు లేకుండా చేద్దాం విందు... ఆనందంతో వేద్దాం చిందు...

author img

By

Published : Dec 27, 2020, 10:53 AM IST

dawat-without-dharu-campaign-in-hyderabad
సామాజిక కార్యకర్త చేగొండి చంద్రశేఖర్​తో ముఖాముఖి ()

వినోదమైనా విషాదమైనా... ఏ వేడుకైనా ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం ఉండాల్సిందే. తాగడం ఊగడం అక్కడితో ఆగకుండా వాహనాల్లో యథేచ్ఛగా రహదారుల పైకి రావడం... ఫలితంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఇలా చిన్నాభిన్నమైన కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రశాంత జీవితాల్లో మద్యం సృష్టించిన కల్లోలాలెన్నో. ఈ విష సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఓ ఉద్యమం మొదలైంది. ఒక్కరితో మొదలై... ఇప్పుడు ఏకంగా 2లక్షల 50వేల మంది పూర్తి మద్దతు పలుకుతున్నారు. దాదాపు 400 గ్రామాలను పూర్తి మద్య నిషేదం వైపు అడుగులు వేయిస్తుంది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న సామాజిక కార్యకర్త చేగొండి చంద్రశేఖర్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

సామాజిక కార్యకర్త చేగొండి చంద్రశేఖర్​తో ముఖాముఖి

ఇదీ చూడండి:

మీ పిల్లలకు మాత్రమే విదేశీ చదువులా?: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.