ETV Bharat / city

Cyber Crime: క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేశారు... లక్షలు పోగొట్టుకున్నారు!

author img

By

Published : Feb 26, 2022, 8:51 PM IST

Cyber Cheaters: ఇళ్లు అద్దెకు కావాలంటారు.. ప్లాట్ల రెంటు చెల్లిస్తామంటారు. 'క్యూఆర్​' కోడ్‌ పంపిస్తాం... స్కాన్‌ చేస్తే డబ్బులు అకౌంట్‌లో పడతాయంటారు. నిజమేనని నమ్మితే నిండా ముంచేస్తుంటారు. ఓఎల్‌క్స్‌ మోసాలకు చిరునామాగా మారిన భరత్‌పూర్‌ సైబర్‌నేరస్థులు కొత్త అవతారమెత్తారు. ఫ్లాట్‌ అద్దెకు కావాలని, తమవారికి వైద్యసేవలు అందించాలంటూ వైద్యనిపుణులు, ఫ్లాట్ల యజమానులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేసుకుంటున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్​ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేశారు
క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేశారు

Cyber Cheaters: హెదరాబాద్​ యూసుఫ్‌గూడలో ఉంటున్న జమునా రాణి.. తమ ఫ్లాట్‌ అద్దెకు ఇస్తామంటూ కొద్దిరోజుల క్రితం ఓఎల్‌క్స్‌లో పెట్టింది. కేంద్ర బలగాల్లో విధులు నిర్వహిస్తున్నానంటూ అంకిత్‌ విజయ్‌ అనే వ్యక్తి ఆమెకు రెండు రోజుల క్రితం ఫోన్‌ చేశాడు. తనకు కశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందని, మీ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుంటాను.. ఫ్లాట్‌ ఫొటోలు పంపితే.. కేంద్రప్రభుత్వం అనుమతి పొంది బయానా చెల్లిస్తానన్నాడు. మరుసటి రోజు ఫోన్‌ చేసి.. మీ ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ పంపించాను.. స్కాన్‌ చేసి.. రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకోండి అన్నాడు. జమునారాణి క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసిన వెంటనే ఆమె ఖాతాలోంచి రూ.లక్ష సైబర్‌ నేరస్థుడి ఖాతాలోకి వెళ్లింది.

  • ఓఎల్‌క్స్‌ మోసాలకు చిరునామాగా మారిన భరత్‌పూర్‌ సైబర్‌నేరస్థుల కొత్త అవతారమిది... ఫ్లాట్‌ అద్దెకు కావాలని, తమవారికి వైద్యసేవలు అందించాలంటూ వైద్యనిపుణులు, ఫ్లాట్ల యజమానులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేసుకుంటున్నారు.

జాగ్రత్తగా ఉండాలి..

'క్యూఆర్​ కోడ్​ పంపించి ఇళ్లు అద్దెకు కావాలనే వారంతా రాజస్థాన్​లోని భరత్​పూర్​, ఆళ్వార్​ జిల్లాలకు చెందిన వారు. ఇక్కడి నుంచి కాల్స్​ చేస్తున్నట్లు విచారణలో తెలిసింది. వీళ్లకు హిందీ తప్ప వేరే భాష రాదు. కాబట్టి హిందీ మాట్లాడుతూ ఆర్మీలో పని చేస్తున్నట్లు మాట్లాడితే నమ్మకూడదు. చిన్న రిమోట్​ గ్రామాల నుంచి వీరు కాల్స్​ చేస్తున్నారు. వీరి ఫోన్​ కాల్స్​ను కూడా ట్రేస్​ చేయడం చాలా కష్టమైన పని. ఆర్మీ అని ఫోన్​ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.'

-కె.వి.ఎం.ప్రసాద్‌, సైబర్‌ క్రైం ఏసీపీ, హైదరాబాద్‌

వైద్యురాలికి టోకరా

సికింద్రాబాద్‌లో ఒక డయాగ్నస్టిక్‌ కేంద్రం నిర్వహిస్తున్న వైద్యురాలు డాక్టర్‌ మంజుశ్రీని భరత్‌పూర్‌ నేరస్థులు చాలా నైపుణ్యంగా మోసం చేశారు. ఆమె నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్‌ కేంద్రం వివరాలను తెలుసుకున్నారు. ఐదురోజుల క్రితం ఆమెకు ఫోన్‌ చేసి.. తమ బెటాలియన్‌లో యాభైమందికి కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయాలని అడిగారు. వైద్యపరీక్షలకు ఎంతవుతుందో చెప్పాలన్నారు. ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున రూ.2.5 లక్షలు అవుతుందని ఆమె వారికి వివరించారు. రూ.1.25లక్షలు అడ్వాన్స్‌గా పంపుతామని, బ్యాంక్‌ ఖాతా వివరాలు తెలపాలని కోరారు. ఆమె ఖాతా వివరాలు చెప్పగానే.. మీకో సంక్షిప్త సందేశం వస్తుందని, దాన్ని తెరవగానే మీ పేటీఎం లేదా ఫోన్‌పే, గూగుల్‌పే వివరాలను నింపి.. నగదు మొత్తం రాయాలంటూ చెప్పారు. సంక్షిప్త సందేశం వచ్చాక ఆమె నిందితులు సూచించిన విధంగా చేయగా.. రూ.1.25లక్షలు ఆమె ఖాతాలోంచి విత్‌డ్రా అయ్యాయి. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు.

ఇలా నగదు లాగేస్తున్నారు...

  • ఫ్లాట్‌కు అడ్వాన్స్‌ రెండునెలలది ఇస్తామని మొత్తం ఎంతవుతుందో చెప్పాలని అభ్యర్థిస్తారు. బాధితులు చెప్పగానే. ..రెండు నెలల అడ్వాన్స్‌ సొమ్ము తమకు పంపింతే... ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని అంతే మొత్తాన్ని నగదు బదిలీ చేస్తామంటారు. బాధితులు రూ.50వేలు పంపించగానే.. తమకు అందలేదని చెబుతారు. మరోసారి నగదు బదిలీ చేయండి అంటూ రూ.లక్షలు వచ్చేంతవరకూ ఫోన్లు చేసి తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.
  • భరత్‌పూర్‌ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నివాసముంటున్న సైబర్‌ నేరస్థులు ఈ ఏడాది యాభైరోజుల్లో వెయ్యిమందిని మోసం చేసుంటారని పోలీసులు అంచనా వేశారు. వీరిని అరెస్ట్‌ చేసేందుకు కొద్దిరోజుల్లో అక్కడికి వెళ్తున్నారు.

ఇదీ చదవండి:

today crime news: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి.. పలువురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.