ETV Bharat / city

మాట వీడని ఉద్యోగులు.. పట్టు వదలని ప్రభుత్వం.. సీపీఎస్ పై చర్చోపర్చలు

author img

By

Published : Sep 6, 2022, 4:41 PM IST

Updated : Sep 6, 2022, 7:25 PM IST

CPS
సీపీఎస్​పై చర్చలు

CPS unions: సీపీఎస్​ రద్దుపై ఉద్యోగులు పట్టువీడడంలేదు..ప్రభుత్వం మెట్టుదిగడంలేదు. ఇరువురి మధ్య చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం 20 ఉద్యోగ సంఘాల నేతలను.. ప్రభుత్వం మళ్లీ చర్చలకు ఆహ్వానించింది. అంతకు ముందే చర్చలకు వెళ్లిన ఉద్యోగులు, సీపీఎస్ రద్దుపైనే చర్చలకు వెళతామని ప్రకటించారు.

AP Employes on CPS: ఏపీలో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే తాము వచ్చామని మంత్రుల సమావేశంలో స్పష్టంచేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జీపీఎస్‌ గురించి మాట్లాడాలనుకుంటే ఇకపై అసలు చర్చలకు పిలవొద్దని తేల్చి చెప్పినట్టు వెల్లడించారు. తాము సమావేశ గదిలోకి వెళ్లాక మంత్రులు యథాతథంగా జీపీఎస్‌ విధానంపైనే మాట్లాడదామన్నారని తెలిపారు. పాత పింఛను విధానంపై మాట్లాడదామంటేనే తాము వచ్చామని, లేదంటే వచ్చేవాళ్లం కాదని చెప్పామన్నారు. తాము పాత పింఛనుపై మాట్లాడదామంటే మీరు జీపీఎస్‌ ట్రాక్‌లోకి రండి.. దానికి తాము కొంత వెసులుబాట్లకు సిద్ధమేనని మంత్రులు చెప్పారని తెలిపారు. కానీ, పాత పింఛను విధానంలోకి వస్తే ఒకట్రెండు వెసులుబాట్లకు సిద్ధమేనని తెలిపామని చెప్పారు. ప్రభుత్వం తరఫు నుంచి పాత పింఛను విధానానికి వచ్చే అవకాశం ఇసుమంత కూడా లేదని మంత్రులు చెప్పారని నేతలు తెలిపారు. మరి ఆమాత్రం దానికి ఎందుకు ప్రతిసారీ చర్చలకు పిలవడం దేనికి.. ఇది కరెక్టు కాదని చెప్పామని ఏపీసీపీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు మరియదాస్‌ తెలిపారు.

మరోవైపు, వేలాది సీపీఎస్‌యూఎస్‌ నాయకులు, టీచర్లపై కేసులు పోలీసులు కేసులు పెట్టారని, అక్రమ కేసులు రద్దు చేయాలని కోరినట్టు తెలిపారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరనున్నట్టు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సెప్టెంబర్‌ 1న పోలీసులు తమ ఇళ్లు ముట్టడించారని నేతలు రవికుమార్‌, దుర్గారావు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

"పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే చర్చలకు వచ్చాం. చర్చలకు పిలిచి మళ్లీ జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారు. ఇకపై అసలు చర్చలకు పిలవొద్దని ప్రభుత్వానికి చెప్పాం. వేలాది సీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్లపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు రద్దు చేయాలని కోరాం. డీజీపీని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరుతాం. సెప్టెంబర్ 1న పోలీసులు మా ఇళ్లు ముట్టడించారు. మహిళా ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు." -ఏపీసీపీఎస్‌యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మరియదాస్

రేపు మరోసారి చర్చలు: సీపీఎస్‌పై రేపు మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ సూచించింది. 20మంది ప్రతినిధులను ఈ మేరకు ఆహ్వానించింది. బుధవారం సాయంత్రం 4గంటలకు చర్చలు జరగనున్నాయి.

సీపీఎస్​పై చర్చలు


ఇవీ చదవండి:

Last Updated :Sep 6, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.