ETV Bharat / city

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతోంది: ఏకే సింఘాల్‌

author img

By

Published : Jun 11, 2021, 6:59 PM IST

కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో 4 లక్షల 4 వేల డోసులు అందుబాటులో ఉన్నాయన్న ఏకే సింఘాల్‌.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు ప్రారంభించామని తెలిపారు.

ఏకే సింఘాల్‌
ఏకే సింఘాల్‌

రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్‌ వివరించారు. ప్రస్తుతం 454 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అందుతోందని వెల్లడించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఐసీయూ, పడకలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 4 లక్షల 4 వేల డోసులు అందుబాటులో ఉన్నాయన్న ఏకే సింఘాల్‌... ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు ప్రారంభించామని వెల్లడించారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకూ టీకాలు వేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండీ... DSC-2008: డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌: మంత్రి సురేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.