ETV Bharat / city

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్

author img

By

Published : Jan 18, 2022, 9:06 AM IST

Updated : Jan 18, 2022, 9:43 AM IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం

09:04 January 18

25 మంది జూనియర్ వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా

covid cases in vijayawada government hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఇతర వైద్యులకు పాజిటివ్​గా తేలింది. వీరితోపాటు 25 మంది జూనియర్ వైద్యులు, పలువురు పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..
Corona cases in India: మరోవైపు దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనా​వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,76,18,271
  • మొత్తం మరణాలు: 4,86,761
  • యాక్టివ్ కేసులు: 17,36,628
  • మొత్తం కోలుకున్నవారు: 3,53,94,882

Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India
భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 79,91,230 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,04,41,770కు చేరింది.

అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 19,79,856 మందికి కరోనా సోకింది. 4,987 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,12,64,767కి చేరగా.. మరణాలు 55,63,226కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 3,89,553 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 468 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.7 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 1,02,144 కేసులు వెలుగుచూశాయి. మరో 296 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 84,429 మంది వైరస్ బారిన పడ్డారు.​ 85 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 83,403 కొత్త కేసులు బయటపడగా.. 287 మంది మరణించారు.
  • స్పెయిన్​లో 1,10,489 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి

chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

Last Updated :Jan 18, 2022, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.