ETV Bharat / city

బీఎస్పీ నేత ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​కు కరోనా

author img

By

Published : Aug 10, 2021, 3:06 PM IST

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు.

బీఎస్పీ నేత ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​కు కరోనా
బీఎస్పీ నేత ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్​కు కరోనా

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్​ లక్షణాలతో హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ప్రవీణ్​కుమార్​ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్​ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. వైద్యుల సలహాలు తీసుకుని ప్రవీణ్​ కుమార్​ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి... సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు.

ఇదీ చదవండి:

Netanna Nestam: వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.