ETV Bharat / city

Chandrababu తెలుగును కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమం చేయాలన్న చంద్రబాబు

author img

By

Published : Aug 29, 2022, 1:05 PM IST

తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ స్కూళ్లలో తెలుగు మాధ్యమం మాయమవుతుందని వింటే బాధగా ఉందన్నారు. భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu
చంద్రబాబు

గిడుగు జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకొంటున్న మనం...ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి... తెలుగు మీడియం మాయమవుతుందని వింటుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనా భాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదని మండిపడ్డారు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం ఇంకా దురదృష్టకరమని అన్నారు. తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక 63 కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ వార్త తప్ప... ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియదని విమర్శించారు. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్ధ కూడా నిరుపుయోగంగా మారిందని ధ్వజమెత్తారు. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ... తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకునేందుకు... మనందరం పునరంకితం అవుదామని చంద్రబాబు కోరారు. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాషేనన్న ఆయన...తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు రామ్మూర్తి పంతులు పెద్ద పోరాటమే చేశారని గుర్తు చేశారు.

  • ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లిభాష. తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు పెద్ద పోరాటమే చేసారు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం...ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలి.(1/5) pic.twitter.com/G19UQhILcM

    — N Chandrababu Naidu (@ncbn) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ... తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితమవుదాం.(5/5)

    — N Chandrababu Naidu (@ncbn) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘‘తెలుగు అకాడమీని.. తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక రూ.63 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయన్న వార్త తప్ప.. ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేసిందనేది ఎవరికీ తెలియదు. తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ కూడా నిరుపయోగంగా మారింది. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాష. తెలుగును వాడుక భాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు పెద్ద పోరాటమే చేశారు. తెదేపా హయాంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2018లో ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధను ఏర్పాటు చేశాం’’ -చంద్రబాబు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.