ETV Bharat / city

'జగన్ అండతో వైకాపా ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయి'

author img

By

Published : Dec 11, 2020, 1:41 PM IST

Chandrababu condemns
Chandrababu condemns

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై.. వైకాపా శ్రేణుల దాడిని పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పరామర్శకు వెళ్తోన్న నాయకులపై దాడి చేయడం దారుణమని ధ్వజమెత్తారు. జగన్ అండతో వైకాపా ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని.. పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. పార్టీ నాయకులపై దాడికి పాల్పడినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద తెదేపా నాయకులపై వైకాపా దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పరామర్శకు వెళ్తోన్న నాయకులపై దాడి గర్హనీయమని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కు గండికొట్టారని ఆక్షేపించారు.

సీఎం జగన్ అండతో వైకాపా ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారని విమర్శించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. మృతుల కుటుంబాల పరామర్శకు వెళ్లే నాయకులపై దాడిచేయడం ఫాసిస్ట్ చర్యని ఆక్షేపించారు.

ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రతలే తప్ప ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తెచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. బడుగు బలహీనవర్గాలపై దాడులు జరగని రోజు లేదని దుయ్యబట్టారు. ప్రతిరోజూ బీసీ,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలపై దమనకాండ యధేచ్చగా కొనసాగుతోందన్నారు. నేరగాళ్ల అరాచకాలను నియంత్రించే వ్యవస్థే లేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: అంగళ్లలో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.