CBN on pingali venkaiah: 'పింగళి సేవలు, దేశభక్తిని గుర్తు చేసుకుందాం'
Updated on: Aug 2, 2022, 11:58 AM IST

CBN on pingali venkaiah: 'పింగళి సేవలు, దేశభక్తిని గుర్తు చేసుకుందాం'
Updated on: Aug 2, 2022, 11:58 AM IST
CBN tribute to pingali venkaiah: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
CBN tribute to pingali venkaiah: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరవేసేందుకు దేశం పిలుపునిచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు జాతికి పింగళి వెంకయ్య సాధించిపెట్టిన గౌరవమిదని అన్నారు. విద్య, శాస్త్రీయ రంగాల్లోనూ దేశానికి సేవలందించారని తెలిపారు. పింగళి సేవలు, దేశభక్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందామని పిలుపునిచ్చారు.
-
భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగుజాతి కీర్తి కెరటం పింగళి వెంకయ్య గారి 146వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. జాతీయోద్యమంలోనే కాకుండా, విద్య, శాస్త్రీయ రంగాలలోనూ దేశానికి సేవలందించిన పింగళి వారి బహుముఖ సేవలను, దేశభక్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం(2/2)
— N Chandrababu Naidu (@ncbn) August 2, 2022
జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య భారత జాతికి చిరస్మరణీయులని తెదేపా నేత నారా లోకేశ్ అన్నారు. జాతీయ పతాకం రూపుదిద్ది భారతావనిలో దేశభక్తి ఇనుమడింపచేశారని గుర్తు చేశారు. జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతంచేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడని కొనియాడారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పించారు.
-
జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించిన పింగళి వెంకయ్యగారి 146వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు pic.twitter.com/4TPr2npNDa
— Lokesh Nara (@naralokesh) August 2, 2022
ఇవీ చదవండి:
