ETV Bharat / city

'ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు'

author img

By

Published : Oct 26, 2020, 7:28 PM IST

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడం కక్ష సాధింపే అని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హంద్రీనీవా జలసాధన యాత్ర కొనసాగించాలని తెదేపా నేతలకు సూచించారు.

chandra babu teleconference with kuppama tdp leaders
చంద్రబాబు

ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నిలిచిపోవడం కక్ష సాధింపే అని అన్నారు. పోటాపోటీ ఆందోళనతో అడ్డంకి కల్పించడం ప్రజాద్రోహమనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

హంద్రీనీవా జలసాధన యాత్ర కొనసాగించాలని చంద్రబాబు తెదేపా శ్రేణులకు సూచించారు. పాదయాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జలసాధన పాదయాత్రపై ప్రజల మద్దతు కూడగట్టాలని చంద్రబాబు అన్నారు.

ఇదీ చదవండి: పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.