ETV Bharat / city

అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదు: కేంద్ర హోంశాఖ

author img

By

Published : Nov 19, 2019, 11:03 PM IST

ఏపీ విభజన చట్టంలో చెప్పినట్లుగా... కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు లాభదాయకం కాదని తేలినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్​సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు... కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేసింది.

central home ministry clarity on AP biffercation promises

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినట్లుగా... కడపలో ఉక్కు పరిశ్రమ , దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని తేలినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్ సభలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చి కేంద్ర హోంశాఖ.. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ పూర్తవయ్యే వరకు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దుగరాజపట్నం పోర్టుకు బదులుగా... ప్రత్యామ్నాయ సల్థాలు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పింది.

ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు కోసం 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.14 వేల 310 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. 2015-20 మధ్య 5 ఏళ్ల కాలానికి రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.22 వేల 113 కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించగా... 2015-19 వరకు రూ.19 వేల 613 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. విభజన చట్టంలోని అత్యధిక అంశాలు ఇప్పటికే అమలు చేశామని... మరికొన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని హోంశాఖ చెప్పింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్​కు ఆమోదముద్ర సహా... ఏపీలో విద్యా సంస్థలకు ఇప్పటివరకు రూ.1638 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : క్షిపణి పరీక్షా కేంద్రానికి లైన్​ క్లియర్... కానీ షరతులు వర్తిస్తాయి

Intro:Body:

AP_HYD_Del_04_19_AP_VIBHAJANA_HAMILU_LS_DRY_AV_3181995

AP_HYD_Del_04_19_AP_VIBHAJANA_HAMILU_LS_DRY_AV_3181995

AP_HYD_Del_04_19_AP_VIBHAJANA_HAMILU_LS_DRY_AV_3181995

AP_HYD_Del_04_19_AP_VIBHAJANA_HAMILU_LS_DRY_AV_3181995

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.