ETV Bharat / city

తెలంగాణ: రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్​..రూ. 17.72 కోట్ల నకిలీ నోట్లు లభ్యం

author img

By

Published : Jun 23, 2021, 2:55 PM IST

రంగురాళ్లు చోరీ అయ్యాయని వారం క్రితం జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇచ్చిన ఫిర్యాదు కేసు.. మరో మలుపు తిరిగింది. జ్యోతిష్యుడు తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

fake currency new twist
రంగురాళ్ల చోరీ కేసులో ట్విస్ట్

17.72 కోట్ల నకిలీ నోట్లు లభ్యం

రంగురాళ్లు చోరీ అయ్యాయని జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ కేసులో ట్విస్ట్​ నెలకొంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులో చూశాయి. బెల్లంకొండ మురళీకృష్ణశర్మ ఇంట్లో భారీగా నగదును పోలీసులు గుర్తించారు. మురళీకృష్ణ శర్మ ఇంట్లో దాదాపు రూ.18 కోట్లు విలువజేసే నకిలీ నోట్లు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

నకిలీ నోట్లతోపాటు.. మురళీకృష్ణ ఇంట్లో రూ. 6లక్షల 32వేల నగదు సైతం లభ్యమైంది. డబ్బు విషయం దాచి.. రంగురాళ్లు పోయాయని మురళీకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 90 కోట్ల రూపాయల హవాలా మనీ కేసులో మురళీకృష్ణ జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జ్యోతిష్యుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

Chandrababu: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు తగ్గట్లేదు

Delta Plus: 40కి పైగా 'కొత్తరకం' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.