ETV Bharat / city

JP Nadda on CM KCR కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యమన్న జేపీ నడ్డా

author img

By

Published : Aug 27, 2022, 9:36 PM IST

JP Nadda Fire on CM KCR కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న భాజపా భారీ బహిరంగ సభలో తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.

JP Nadda Fire on CM KCR
జేపీ నడ్డా

JP Nadda Fire on CM KCR తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న భాజపా భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై మండిపడ్డారు. కాకతీయులు ఏలిన వరంగల్‌ గడ్డకు నమస్కారాలు అని తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు.

తెరాస పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జేపీ నడ్డా ఆరోపించారు. సభకు ముందురోజు అనుమతి రద్దు చేయించారని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామని తెలిపారు. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారు. మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్‌ జైలును కూల్చారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీస్పెషాల్టీ నిర్మించలేదు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఏంగా మార్చుకున్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైంది. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం ఇదే.- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి ఎక్కడ?: ఓరుగల్లులో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని జైలును కూల్చారని జేపీ నడ్డా అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించలేదని మండిపడ్డారు. కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

ఏటీఎంలా కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ను ఏటీఏంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదని ఆగ్రహం వక్తం చేశారు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నడ్డా: సభలో పాల్గొనేందుకు వరంగల్‌ చేరుకున్న జేపీ నడ్డా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, తరుణ్‌ చుగ్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ బాలసముద్రంలోని ఇంటికి వెళ్లారు. రాష్ట్రపరిస్థితులపై ఆయనతో కాసేపు ముచ్చటించారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.