ETV Bharat / city

AP TOPNEWS:ప్రధాన వార్తలు@1PM

author img

By

Published : Aug 5, 2022, 12:57 PM IST

AP TOPNEWS
AP TOPNEWS

.

  • Chandrababu: "ప్రశ్నించిన అందరిపై కేసులు పెడతారా..?"..
    ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలి అనుకుంటే...రాష్ట్రంలోని 5 కోట్ల మందిపైనా ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెన పై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్​పై కేసు పెట్టి అరెస్టు చేయడం.. ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెదేపా నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీఐడీ ఏడీజీకి వర్ల ఫిర్యాదు..
    తెదేపా నాయకులపై.. సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న.. విజయసాయిరెడ్డి, దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జడ్జీల సంఖ్యను పెంచడానికి సీఎం అంగీకరించలేదు: కేంద్ర మంత్రి రిజిజు..
    ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సీఎం జగన్​ అంగీకరించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంచే ప్రతిపాదన లేదని రిజిజు స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఆర్టికల్‌ 124, 217, 224 ప్రకారం జరుగుతాయని, అందుకు కులం, తరగతి ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంట్లో వృద్ధ దంపతుల మృతి.. ఏం జరిగింది?..
    విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దంపతుల మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కల్తీ మద్యానికి 8 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది..
    కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరోమారు బిహార్​లో కలకలం సృష్టించింది. సారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'..
    ఎన్​డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • షారుక్​ 'మన్నత్'​తో సల్మాన్​కు ఉన్న బంధం తెలుసా?..
    బాలీవుడ్ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​ బంగలా 'మన్నత్​'పై మనసు పారేసుకున్నారు కథానాయకుడు సల్మాన్​ ఖాన్​. దాని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?..
    పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని లక్షలకు తీసుకుంటే బెటర్?..

    అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు.. ఆర్థికంగా భారం పడకుండా ఆదుకునేది ఆరోగ్య బీమా. ఎప్పుడో ఏళ్ల క్రితం తీసుకున్న పాలసీకి క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కానీ, ఆ ధీమా మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు సరిపోతుందన్నది మాత్రం సమీక్షించుకోరు. ఇది ఎంతమాత్రం సరికాదనే చెప్పాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన బీమా పాలసీలోనూ మార్పులు, చేర్పులు తప్పనిసరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నైట్​ క్లబ్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి..
    థాయ్​లాండ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ క్లబ్​ మంటలు చెలరేగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.