కల్తీ మద్యానికి 11 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది

author img

By

Published : Aug 5, 2022, 11:00 AM IST

Updated : Aug 5, 2022, 3:18 PM IST

Many people dead and several ill after consuming spurious liquor in chapra saran bihar

Spurious liquor Bihar: కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరోమారు బిహార్​లో కలకలం సృష్టించింది. సారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మొత్తం 11 మంది చనిపోయారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే బిహార్​ పోలీసుల అండతోనే బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని జేఏపీ అధినేత పప్పు యాదవ్​ ఆరోపించారు.

Spurious Liquor Bihar: లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్​లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. సారన్ జిల్లాలోని ఛప్రాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఛప్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో 25 మంది కంటిచూపు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో మరికొందరు బాధపడుతున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు దేశీ మద్యాన్ని సేవించారని గ్రామస్థులు వెల్లడించారు. మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన బృందాన్ని గ్రామానికి పంపినట్లు సారన్ జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు. బాధితులు.. మిథనాల్​ కలిపిన మద్యాన్ని సేవించినట్లు సమాచారం.

"మా గ్రామంలో బహిరంగంగానే మద్యం విక్రయిస్తున్నారు. అంతే కాకుండా మద్యంలో స్పిరిట్​ వంటి రసాయనాలు కలిపి అమ్మకాలు చేపడుతున్నారు. బాధితుల మృతదేహలకు పోస్టుమార్టం చేపట్టాలని అధికారులను విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు."

-- మృతుడి సోదరుడు

అయితే ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాలు ఉన్నాయని, అయినా తమకు అప్పగించడం లేదని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం జేఏపీ​ అధినేత పప్పు యాదవ్​.. బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. రాష్ట్ర పోలీసుల అండతోనే బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

ఇవీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

దేశవ్యాప్తంగా 4.24 కోట్ల కేసులు పెండింగ్‌.. సుప్రీంలోనే 71వేలు..

Last Updated :Aug 5, 2022, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.