ETV Bharat / city

ప్రధానవార్తలు@11AM

author img

By

Published : Jul 21, 2022, 10:59 AM IST

.

ap topnews
ap topnews

  • కోలుకోవడానికి ఎన్నేళ్లో... ఇంకా వరద నీటిలోనే లంకగ్రామాలు..
    రాష్ట్రంలో వర్ష బీభత్సానికి లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు అతాకుతలమయ్యాయి. వర్షాలు తగ్గినప్పటికీ ఇంకా లంకలు, లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. వందల గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిళ్లింది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 15.21 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన..
    గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో, నరకయాతన అనుభవిస్తున్నామని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తమ ఇళ్లలకు చేరుకుంటున్న బాధితులు.. ఆస్తి, పంట నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నిద్రిస్తున్న వ్యక్తి హత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగుడు..
    పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో.. గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని దుండగుడు బండరాయితో కొట్టి.. హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు 2 గంటలలోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Buggana: ఏ పెన్ను, పెన్సిల్‌ వాడాలో చెబితే ఎలా: మంత్రి బుగ్గన..
    రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సమర్థంగా పనిచేసేలా సంస్కరణలు చేపడుతున్నామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీనియర్‌ అధికారుల సమావేశం జరుగుతుందనుకున్న తరుణంలో మంత్రి బుగ్గన ఊహించని విధంగా కార్యాలయానికి వచ్చారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బైక్​ను ఢీకొట్టిన ట్రక్కు.. బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన మహిళ..రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన ఓ గర్భిణీ.. పాపకు జన్మనిచ్చి మరణించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీంతో మృతురాలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?..
    భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'లైగర్'​ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్సే..
    పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్​ సినిమా ట్రైలర్​ వచ్చేసింది. మెగాస్టార్​ చిరంజీవి, రెబల్​స్టార్​ ప్రభాస్​ సోషల్​మీడియా వేదికగా ట్రైలర్​ను విడుదల చేశారు. పవర్​ఫుల్​ డైలాగ్స్​, ఫైట్స్​తో ఈ ట్రైలర్​ మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • డోప్‌ పరీక్షలో ఫెయిల్​.. కామన్​వెల్త్​ రేసు నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు ఔట్​..
    భారత జట్టులో మరోసారి డోపింగ్​ కలకలం సృష్టించింది. కామన్​వెల్త్​ క్రీడలకు ఎంపికైన అథ్లెట్లు ఎస్​.ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది. ఈ అథ్లెట్లు ఇలా డోప్​ పరీక్షల్లో విఫలమవడం ఇది రెండోసారి. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పుతిన్ ఎదురుచూపులు.. ఎర్డోగన్‌ ప్రతీకారం తీర్చుకున్నారా..?
    రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో ఇరాన్‌లో జరిగిన సమావేశానికి ముందు ఒంటరిగా కొద్దిసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.