ETV Bharat / city

ప్రధాన వార్తలు@7AM

author img

By

Published : Jul 20, 2022, 6:57 AM IST

.

AP Top news
AP Top news

  • శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి.. ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..
    ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. ఆర్థికశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • CM Jagan: పేదల్ని వెతుక్కుంటూ పథకాలే వెళుతున్నాయి..!
    ..పాలకుల్లో నిబద్ధత, విశ్వసనీయత ఉండాలని, అప్పుడే పాలనలో మార్పు కనిపిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే పేదల్ని వెతుక్కుంటూ వారి తలుపు తడుతున్నాయన్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చేస్తున్నామని ఆయన తెలిపారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Polavaram: 'పోలవరం ఆలస్యం.. ఏపీ వైఫల్యమే'..
    రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆలస్యమైనట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • గోదావరిలో గల్లంతై ఒకరి మృతి.. లభించని మరో ఇద్దరి ఆచూకీ !..
    కోనసీమ జిల్లాలో గోదావరి మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నది ఉద్దృతి గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • త్రివిధ దళాల్లో 1.35 లక్షల పోస్టులు ఖాళీ.. వెల్లడించిన కేంద్రం..
    త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైల్వే మెలిక.. సర్వీస్ ఛార్జ్ తొలగించి.. అసలు ధరకు కలిపేసి....
    ప్రీమియం రైళ్లలో సరఫరా చేసే ఆహార పదార్థాలపై సర్వీస్ ఛార్జీని రద్దు చేస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. అయితే, రద్దు చేసిన సర్వీస్ ఛార్జీని.. ఆహార పదార్థాల ధరల్లో కలిపేసి ప్రయాణికులకు మెలిక పెట్టింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అభిమానులకు షాక్​ ఇచ్చిన ప్రముఖ సింగర్​.. అవన్నీ 'డిలీట్'​..
    ప్రముఖ బాలీవుడ్ సింగర్​ అద్నాన్​ సమీ అభిమానులకు షాక్ ఇచ్చారు. సోషల్​మీడియా ఇన్​స్టా నుంచి తప్పుకున్నారు. తన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. 'అల్విదా' అని క్యాప్షన్​ జోడించారు. అయితే ఎందుకు ఇలా చేశారో చెప్పలేదు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. మనోళ్లు అదరగొడతారా?..
    కామన్వెల్త్‌ క్రీడలు మరో ఎనిమిది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ సారి పోటీల్లో కొన్ని కొత్త ఆటలు చేరిన నేపథ్యంలో భారత్​కు కూడా ప్రాతినిథ్యం పెరిగింది. దీంతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటి పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆటగాళ్లు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి..
    ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో మన దేశం నుంచి 1,60,263 ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2021 ఇదే త్రైమాసికంలో ఎగుమతి అయిన 1,27,083 వాహనాలతో పోలిస్తే ఈసారి 26 శాతం ఎక్కువగా జరిగాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తెలిపింది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఐరోపాపై మళ్లీ కొవిడ్‌ పడగ.. మూడింతలు పెరిగిన కేసులు..
    ఐరోపాలో మరోసారి కొవిడ్‌ విజృంభిస్తోంది. గత ఆరు వారాల వ్యవధిలో ఇక్కడ కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. ఆస్పత్రుల చేరికల్లో సైతం రెండు రెట్లు పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం ఈ వివరాలు వెల్లడించింది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.