ETV Bharat / city

3PM AP TOP NEWS

author img

By

Published : Aug 11, 2022, 3:00 PM IST

3PM టాప్​ న్యూస్​

TOP NEWS
TOP NEWS

  • ఏపీ సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు.. సుప్రీంకు అమరావతి నిర్మాణ సంస్థ
    Foster company: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్‌ సంస్థ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • YS VIJAYAMMA: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. హైదరాబాద్​ వెళ్తుండగా ఘటన
    ACCIDENT TO YS VIJAYAMMA: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా కర్నూలు సమీపంలోని ఓ పెట్రోల్​ బంకు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Godavari Floods: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక.. ముంపు బారిన లంకలు..
    Dhavaleswaram flood: గోదావరి నదికి రెండోసారి వరద పోటెత్తడంతో కోనసీమ జిల్లాలోని లోతట్టు కాజ్వేలు ముంపు బారిన పడుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. సముద్రంలోకి 13.59 లక్షల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టమాటా రైతుల బాధ ప్రభుత్వానికి పట్టదా
    TOMATO FARMERS: టమాటా రైతుల బాధ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. జిల్లాలో టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక నేలపై పారబోస్తుంటే.. కనీసం ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ గాని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అనంతపురంలోని కక్కలపల్లి టమాటా మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సారీ.. మీ దగ్గర అప్పుడు రూ.700 కొట్టేశా.. ఇప్పుడీ డబ్బు తీసుకోండి!'
    ఆ వ్యక్తి అనేక ఏళ్ల క్రితం ఓ దొంగతనం చేశారు. కానీ.. ఇప్పటికీ అపరాధ భావం వెంటాడుతోంది. అందుకే ఇన్నేళ్ల తర్వాత బాధితులకు లేఖ రాశారు. తనను క్షమించాలని కోరుతూ డబ్బును తిరిగి పంపారు. ఇదంతా ఎక్కడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్​'
    India Gate News: అమర జవాన్ల జ్యోతుల విలీనంతో ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిన దిల్లీలోని ఇండియా గేట్‌కు ఓ అంతర్జాతీయ నేపథ్యముంది. అంతేకాదు ఆంగ్లేయులు మనకు మాటిచ్చి చేసిన మోసానికీ.. అమాయక భారతీయ సిపాయిలకు చేసిన వంచనకు ఇదో మౌన సాక్ష్యం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అలా గెలవడం కంటే ఓడిపోవడమే మేలు'.. రిషి కీలక వ్యాఖ్యలు
    Rishi sunak and liz truss: బ్రిటన్​ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేసే తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడం కంటే ఓడిపోవడం మేలని రిషి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!
    Money saving tips for families : నెల‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు సంపాదించే వారికి అదనంగా రూ. 1000 - రూ.1500 ఖ‌ర్చు చేయ‌డం పెద్ద‌గా అనిపించ‌దు. కానీ, ఇలాంటి చిన్న చిన్న కొనుగోళ్లు మీకు తెలియ‌కుండానే ఖర్చుల‌ను పెంచేస్తాయి. అటువంటి కొనుగోళ్లను నివారించేందుకు ఒక చ‌క్క‌టి పరిష్కారం 30-రోజుల నియమం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కామన్వెల్త్​లో మిస్సింగ్ కలకలం.. మొన్న 10 మంది.. ఇప్పుడు మరో ఇద్దరు
    ఇప్పటికే కామన్వెల్త్​ గేమ్స్​లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా.. తాజాగా పాకిస్థాన్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు కూడా మిస్​ అయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బింబిసార'లో కొత్తేమి లేదు.. చూసి మురిసిపోకండి: ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్​
    Bimbisara movie: 'బింబిసార', 'సీతారామం' హిట్‌ అయిన కారణంగా ఆనందపడిపోవద్దని అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. బింబిసార చిత్రం రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనని.. కొత్త కథేమీ కాదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.