NCB: గంజాయి అక్రమ రవాణాలో ఏపీయే టాప్‌: ఎన్‌సీబీ

author img

By

Published : Sep 29, 2022, 9:32 AM IST

Updated : Sep 29, 2022, 11:51 AM IST

Aannabis in Andhra Pradesh

Aannabis in Andhra Pradesh: మత్తు యువత జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో తరచూ చూస్తునే ఉన్నాం. గంజాయి అత్యధికంగా స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉన్నట్లు నార్కోటిక్స్​ కంట్రోల్ బ్యూరో తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది.

Narcotics Control Bureau: ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. 2021లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై ఎన్‌సీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే.

ఎక్కువ సరకు దొరికింది మన రాష్ట్రంలోనే: ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో హషీష్‌ 18.14 కిలోలు, హషీష్‌ ఆయిల్‌ 6.13 లీటర్లు, 3 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో 1,775 కేసులు నమోదుచేసి, 4,202 మందిని అరెస్టు చేశారు. తెలంగాణలో 35,270 కిలోల గంజాయి, 0.03 కిలోల హషీష్‌, 18.5 లీటర్ల హషీష్‌ ఆయిల్‌, 0.03 కిలో హెరాయిన్‌, 0.01 కిలోల కెటామైన్‌, 31 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా 7,618 కిలోల హెరాయిన్‌ దొరకగా, అందులో అత్యధికంగా 3,334.96 కిలోలు గుజరాత్‌లో, 1,337.29 కిలోలు ఉత్తర్‌ప్రదేశ్‌లో, 501 కిలోలు మేఘాలయలో స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాదిలో కేరళలో అత్యధికంగా 339.93 కిలోల హెరాయిన్‌ దొరికింది. డ్రగ్స్‌ అత్యధిక ప్రభావం ఉన్నట్లు ప్రచారం జరిగిన పంజాబ్‌లో 443.51 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.