ETV Bharat / city

AP Employees Union Leaders: '55 శాతం ఫిట్‌మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం'

author img

By

Published : Dec 14, 2021, 5:49 PM IST

Updated : Dec 14, 2021, 6:22 PM IST

AP Employees Union Leaders
AP Employees Union Leaders

17:41 December 14

ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సజ్జల చర్చలు

AP Employees Union Leaders On Fitment: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చర్చలు ముగిశాయి. అనంతరం ఉద్యోగాల సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలు, ఆవేదనను సజ్జలకు స్పష్టంగా చెప్పామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సీఎస్ కమిటీ సిఫారసులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకించామని వెల్లడించారు.

ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్ అమలు, లబ్ధిలో తేడాలు ఉన్నాయి. సీఎంతో జరిగే చర్చల్లో స్పష్టత తీసుకుంటాం. ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చే సంప్రదాయం కొనసాగించాలి. సచివాలయ సంఘంలా 34 ఫిట్‌మెంట్‌కు మేం ఒప్పుకోం.55 శాతం ఫిట్‌మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం - బొప్పరాజు వెంకటేశ్వర్లు ,ఏపీ జేఏసీ ఛైర్మన్

55శాతం ఫిట్​మెంట్ ఇవ్వాలి - బండి శ్రీనివాస్

bandi srinivas on PRC: పీఆర్‌సీ, 70 డిమాండ్లపై సజ్జలతో చర్చించామని బండి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం జగన్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నామన్న ఆయన.. హామీలు అమలుచేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2018 జులై నుంచి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత ఫిట్ మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టమని వ్యాఖ్యానించారు.

sajjala On Fitment to Govt Employees: ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతోనూ చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగులకు నష్టం ఉండదన్నారు.14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదన్న ఆయన.. 14.29 శాతం పీఆర్‌సీతో ఐఆర్ కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందని సజ్జల గుర్తు చేశారు.

Sajjala On Employees Fitment: కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సజ్జల తెలిపారు. అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలున్నాయని వెల్లడించారు. సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉందన్న సజ్జల.. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిది ఏళ్లు పడుతోందని చెప్పారు. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదన్నారు.

వారికి మినిమం టైం స్కేల్..

Sajjala On CPS: సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. ఈ అంశంపై పలు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సుప్రీం తీర్పు వల్లే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాలేదన్నారు. ఒప్పంద ఉద్యోగులకు చట్టపరిధిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్న సజ్జల.. వారికి మినిమం టైం స్కేల్ అమలుచేసే యోచన ఉందన్నారు.

'సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిది ఏళ్లు పడుతోంది. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. దీనిపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్లే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాలేదు. ఒప్పంద ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలుచేసే యోచనలో ఉన్నాం' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ఇదీ చదవండి:

Sajjala On Fitment to Govt Employees: సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ పెంచే అవకాశం: సజ్జల

Last Updated : Dec 14, 2021, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.