ETV Bharat / city

'క్షమించండి.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించే ఉద్దేశం లేదు'

author img

By

Published : May 28, 2020, 10:48 AM IST

Updated : May 29, 2020, 7:09 AM IST

'క్షమించండి.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించే ఉద్దేశం లేదు'
'క్షమించండి.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించే ఉద్దేశం లేదు'

10:44 May 28

రంగుల అంశంపై హైకోర్టుకు హాజరైన అధికారులు

పంచాయతీ కార్యాలయాల రంగుల విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, పంచాయతీరాజ్​ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ఆలోచన తమకు లేదని సీఎస్​ అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో కోర్టు తీర్పు వచ్చిన అనంతరం కొత్త రంగులు వేయలేదన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం ఉందని చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ కోర్టులో వేర్వేరుగా ప్రమాణపత్రాలు దాఖలు చేశారు. 

క్షమించండి..!

లాక్​డౌన్ ముగిశాక రంగులను తొలగించడానికి ఇదే హైకోర్టు ఇచ్చిన మూడు వారాల గడువు ఇంకా మిగిలే ఉందని అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించామని న్యాయస్థానం భావిస్తే క్షమాపణలు కోరుతున్నామన్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం పై విచారణను మూసివేయాలని అభ్యర్థించారు.

నేటికి వాయిదా

అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రంగుల విషయంలో జీవో 623ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న దర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

గత విచారణలో పంచాయతీ కార్యాలయాలకు వైకాపా పార్టీ జెండా రంగులను పోలి ఉన్న రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద కేసు రిజిష్టర్‌ చేసి విచారణ జరిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు నమోదుచేయకూడదని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.

ఇదీ చూడండి..

తితిదే ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించం: వైవీ సుబ్బారెడ్డి

Last Updated : May 29, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.