ETV Bharat / city

తెలంగాణ: ఎలుగుబంట్ల దాడిలో రెండు కళ్లు కోల్పోయిన వృద్ధుడు

author img

By

Published : Nov 19, 2020, 8:27 AM IST

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహెగాం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధుడు బొరె హన్మయ్యపై 25 ఏళ్ల క్రితం మూడు ఎలుగుబంట్లు దాడి చేసి..రెండు కనుగుడ్లను పీకేసి అంధుడిని చేశాయి. తాజాగా గ్రామంలో జంతువుల దాడి ఘటనలు పెరుగుతుండటంతో తన పరిస్థితిని వివరిస్తూ జాగ్రత్తగా ఉండాలని హన్మయ్య గ్రామస్థులకు చెబుతున్నారు.

An old man
An old man

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహెగాం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన బొరె హన్మయ్యపై 25 ఏళ్ల క్రితం మూడు ఎలుగుబంట్లు దాడి చేసి.. రెండు కనుగుడ్లను పీకేసి అంధుడిని చేశాయి. దీంతో వ్యవసాయం, ఇతర పనులు చేయలేక జీవనాధారం కోల్పోయి.. కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో అవస్థలు పడ్డారు. కొన్నేళ్లుగా ఆయన ఇద్దరు కుమారులూ వ్యవసాయం చేస్తూ హన్మయ్యను, ఆయన భార్యను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పులి తిరుగుతోంది. ఈ నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జంతువుల దాడిలో ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఆ వార్తలు విన్న హన్మయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. జంతువుల దాడికి గురైతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో తన అనుభవంతో గ్రామస్థులకు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. అడవి జంతువుల దాడిలో గాయపడిన వారికి అటవీశాఖ పరిహారం ఇస్తుంది. అయితే 25 ఏళ్ల నాటి ఘటన కావడంతో హన్మయ్యకు ఇప్పటివరకూ అలాంటి సాయమేదీ అందలేదు. ఇలాంటి బాధితులపై అటవీశాఖ ఇప్పటికైనా దృష్టిసారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబరు 25న.. కోర్టు స్టే లేని చోటల్లా పట్టాలు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.